![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -638 లో...... సుమిత్ర ఇంటి నుండి వచ్చిన దీపకి కార్తీక్ దిష్టి తీస్తాడు. ఎందుకు దిష్టి తీసావ్ రా అని కాంచన అడుగుతుంది. నువ్వే కదమ్మా కడుపుతో ఉన్నవాళ్లు బయట నుండి వస్తే తియ్యాలన్నావ్ కదా అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు అమ్మకి దిష్టి తగిలిందా అని శౌర్య అడుగుతుంది. అవునని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న ఏదో అనే ఉంటుందని కాంచన అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఒళ్ళో దీప తల వార్చుకొని పడుకుంటుంది. ఆ జ్యోత్స్న మళ్ళీ ఏదైనా అందా బావ.. నువ్వు పార్టీలో కంగారు పడ్డావని అత్తయ్య మావయ్య అనుకుంటున్నారని దీప అడుగుతుంది. ఏమైనా అంటే ఊరుకుంటానా ఏంటని కార్తీక్ అంటాడు.
నువ్వు పడుకో దీప అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి పారిజాతం ఫోన్ చేసి.. ఒరేయ్ నా మనవరాలు పడుకుందా.. దిష్టి తీసావా అని అడుగుతుంది. తీసానని కార్తీక్ చెప్తాడు. ఎవరి దిష్టి తగులుతుందో నీకు తెలుసు కదా అని కార్తీక్ అనగానే.. ఇంకెవరు ఆ జ్యోత్స్న దిష్టి అని పారిజాతం అంటుంది. దానికి పెళ్లి సంబంధం చూడరా దాని తిక్కకుదురుతుంది.. అందుకు ఏం చెయ్యమన్నా చేస్తానని పారిజాతం అంటుంది. నువ్వు ఆ మాత్రం హింట్ ఇస్తే రెచ్చిపోతానని కార్తీక్ అంటాడు. పారిజాతం ఫోన్ కట్ చేశాక జ్యోత్స్ననే అసలైన వారసురాలు అని తెలిస్తే ఏమైపోతావోనని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత దీప నిద్రలో బావ రేపు మన పెళ్లి రోజు గుర్తుందా అని అంటుంది. గుర్తుంది మరదలా అని కార్తీక్ అంటాడు. మరొకవైపు కార్తీక్, దీపల ఫోటో చూస్తూ మీ పెళ్లిని నేనెలా మర్చిపోతానని జ్యోత్స్న అనుకుంటుంది. రేపే మీ మొదటి పెళ్లిరోజు.. చివరి పెళ్లి రోజు అని జ్యోత్స్న అనుకుటుంది. మరుసటి రోజు కార్తీక్, దీప ఇద్దరు రెడీ అయి శ్రీధర్, కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళ గురించి శ్రీధర్ గొప్పగా మాట్లాడతాడు. ఈ రోజు అన్నయ్య ఇంటికి వద్దని కాంచన అంటుంది.
లేదమ్మా వెళ్లి త్వరగా వస్తామని కార్తీక్ అంటాడు. వద్దురా సరదాగా అందరం బయటకు అయినా వెళదామని శ్రీధర్ అంటాడు. లేదు మాస్టారు త్వరగా వస్తామని దీపని తీసుకొని కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు దీప, కార్తీక్ వస్తారని గుమ్మంలో దీప జారిపడేలా నూనె పోస్తుంది జ్యోత్స్న. పారిజాతం డాన్స్ చేస్తూ పైనుండి కిందకు వస్తుంది. అప్పుడే అందరు వస్తారు కార్తీక్ ఒక్కడే ఇంట్లోకి వస్తాడు. దీప ఎక్కడ అని జ్యోత్స్న అడుగుతుంది. వస్తుందని కార్తీక్ చెప్తాడు. దీప గుమ్మంలో అడుగు పెట్టి నూనెపై కాలు వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |